: ఆర్డీఎస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ జరుగుతున్న ఆనకట్ట ఎత్తు పెంపు పనులను ఆంధ్రప్రదేశ్ ఏపీ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. దీంతో, కర్ణాటక సర్కారు అక్కడ భారీ భద్రత ఏర్పాటు చేసింది. కాగా, ఈ ప్రాజెక్టు విషయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య విభేదాలు పొడసూపాయి. ఎత్తు పెంచాల్సిందేనని తెలంగాణ అంటుండగా, అలా జరిగితే రాయలసీమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఏపీ వాదిస్తోంది. ఈ ప్రాజెక్టును మహబూబ్ నగర్ జిల్లా సరిహద్దుకు, కర్ణాటకలోని రాయ్ చూర్ జిల్లా సరిహద్దుకు నడుమ తుంగభద్ర నదిపై నిర్మించారు.