: బ్రెజిల్ చరిత్రలో ఇదే అతిపెద్ద ఓటమి
జర్మనీ చేతిలో చావుదెబ్బతిన్న బ్రెజిల్ తన వరల్డ్ కప్ చరిత్రలో అత్యంత భారీ ఓటమి నమోదు చేసుకుంది. జర్మనీతో గతరాత్రి జరిగిన పోరులో బ్రెజిల్ 1-7 తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. ఇంతకుముందు 1998 వరల్డ్ కప్ ఫ్రాన్స్ 3-0తో బ్రెజిల్ ను చిత్తు చేసింది. నిన్నటివరకు బ్రెజిల్ కు ఇదే భారీ ఓటమి. తాజా సెమీస్ తో ఆ ఓటమి తెరమరుగైంది. కాగా, అంతర్జాతీయ మ్యాచ్ లలోనూ ఆ జట్టుకు ఇదే అతిపెద్ద ఓటమి రికార్డు. 1920లో ఉరుగ్వే చేతిలో 0-6తో భంగపడింది. ఇప్పుడా రికార్డు సమమైంది.