: '2023నాటికి బెంగళూరును సగం మంది ఖాళీ చేయాలి'
బెంగళూరు నగరం మహా కాలుష్యకోరలలో చిక్కుకుంది. అక్కడి ప్రజారోగ్య సంస్థ నీటి నమూనాలను ల్యాబ్ లో పరీక్షించగా.. 52శాతం బోరు నీరు, 59శాతం కుళాయి నీటిలో ప్రమాదకరమైన 'ఈ కొలి' బ్యాక్టీరియా తీవ్ర స్థాయిలో ఉన్నట్లు వెల్లడైంది. బోరునీటిలో 8.4శాతం, కుళాయి నీటిలో 19శాతం బ్యాక్టీరియా ఉందని తేలింది. 'ఈ కొలి' బ్యాక్టీరియ కడుపులో పేగులు, జీర్ణాశయం వద్దకు చేరి మనం తీసుకున్న ఆహారంలోని పోషకాలను అది స్వీకరిస్తుంది. దీంతో మనిషి రోజురోజుకీ కృశించిపోతాడు .
ఈ ఫలితాల ఆధారంగా వచ్చే పది సంవత్సరాలలో కర్ణాటక ప్రభుత్వం బెంగళూరు నగరం నుంచి సగం మంది జనాభాను ఖాళీ చేయించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి వి.బాలసుబ్రమణ్యం అంటున్నారు. బెంగళూరు నగర జలాలపై ఈయన విస్తృత అధ్యయనాన్ని నిర్వహించారు. బెంగళూరు నగరంలో మురుగునీటి వల్లే బూగర్భజలాలు తీవ్ర కాలుష్యమయంగా మారాయని తేలింది. బాలసుబ్రమణ్యం వాదనను బెంగళూరు నగర వాసులు కూడా వ్యతిరేకించడం లేదు. నగరం నుంచి వెలువడే మురుగు నీటిలో 30శాతమే శుద్ధి అవుతుండగా.. మిగతా అంతా వెళ్లి సరస్సులలో కలుస్తుందని,. దాంతో బూగర్భజలాలు విషపూరితంగా మారుతున్నాయని, ఇది ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతుందని బాలసుబ్రమణ్యం అంటున్నారు.