: బ్రెజిల్ గుండె పగిలింది!


సొంతగడ్డపై జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ ను సాధించాలన్న కలకు అడుగుదూరంలో బ్రెజిల్ బోల్తాకొట్టింది. జర్మనీతో జరిగిన సెమీస్ లో దారుణంగా భంగపడింది. ప్రపంచ అగ్రశ్రేణి జట్టు మరీ ఇంత దారుణంగా ఓడడం అటు స్వదేశీ అభిమానులను విచారంలో ముంచెత్తగా, ఇటు సాకర్ వర్గాలను విస్మయపరిచింది. ఇక, పట్టుదలకు మారుపేరుగా నిలిచే జర్మన్లు 7-1తో ఆతిథ్య జట్టుపై నెగ్గి ఫైనల్లోకి దూసుకెళ్ళారు. మ్యాచ్ 90వ నిమిషంలో ఆస్కార్ కొట్టిన గోల్ తో బ్రెజిల్ పరువు కాపాడుకుంది. ఇక, మూడోస్థానం కోసం జరిగే పోరులో బ్రెజిల్... అర్జెంటీనా, నెదర్లాండ్స్ మ్యాచ్ లో ఓడిన జట్టుతో తలపడనుంది. కెప్టెన్ థియాగో సిల్వా ఈ మ్యాచ్ కు దూరం కావడం బ్రెజిల్ రక్షణశ్రేణిని బలహీనపర్చింది. ఈ అవకాశాన్ని సొమ్ము చేసుకున్న జర్మనీ ఫార్వర్డ్ దళం బ్రెజిల్ గోల్ కీపర్ ను ఎడతెగని దాడులతో ఉక్కిరిబిక్కిరి చేసింది.

  • Loading...

More Telugu News