: గవర్నర్ ను కలసిన బీజేపీ తెలంగాణ నేతల బృందం


బీజేపీ తెలంగాణ నేతల బృందం గవర్నర్ నరసింహన్ ను కలిశారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ పై ఆయనకు వివరించారు. అనంతరం తెలంగాణ బీజేపీ శాసనసభాపక్ష నేత డా.లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ, ఇరు రాష్ట్రాల్లో విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. ఈ క్రమంలో రీయింబర్స్ మెంట్ పై అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు. దీనిపై రెండు ప్రభుత్వాలు చర్చించుకోవాలని సూచించారు. రీయింబర్స్ మెంట్ విషయంలో జోక్యం చేసుకోవాలని గవర్నర్ ను కోరామన్నారు.

  • Loading...

More Telugu News