: ప్రతిపక్ష హోదా ఇవ్వండి... రాష్ట్రపతిని కలిసిన సోనియా గాంధీ
ప్రతిపక్ష హోదాపై ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. లోక్ సభలో రెండవ అతిపెద్ద పార్టీగా నిలిచిన తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని సోనియా గాంధీ రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. అలాగే ఎన్నికల మందు తాము పలు పార్టీలకు మద్దతు తెలిపామని, ఆయా పార్టీలతో కలుపుకుంటే తాము ప్రతిపక్ష హోదాకు అర్హులమని సోనియా రాష్ట్రపతికి తెలిపారు. దీనిపై రాష్ట్రపతి సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.