: ప్రాణ్ కు అమితాబ్ అభినందనలు
ప్రముఖ బాలీవుడ్ నటుడు ప్రాణ్ కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం రావడంపై నటుడు అమితాబ్ బచ్చన్ స్పందించాడు. సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు ట్విట్టర్, ఫేస్ బుక్ లలో ప్రాణ్ కు అభినందనలు తెలిపాడు. ప్రాణ్ గొప్ప మానవతావాదనీ, భారతీయ చలనచిత్ర పరిశ్రమలో చెప్పుకోదగిన నటులలో ప్రాణ్ ఆణిముత్యంలాంటి వారని ప్రశంసించాడు. ఫాల్కే అవార్డుకు ప్రాణ్ పూర్తి అర్హుడని అమితాబ్ కొనియాడాడు. ప్రాణ్ తనకు మంచి స్నేహితుడనీ, ఎప్పుడూ ఆరోగ్యంతో ఉండాలని ఆశిస్తున్నట్లు బిగ్ బీ తెలిపాడు. ప్రాణ్ సాహెబ్, తాను అనేక చిత్రాల్లో కలిసి పనిచేశామని, క్రమశిక్షణ, వృత్తిపట్ల ఎంతో నిబద్ధత కలిగిన నటుడని వివరించాడు. అమితాబ్, ప్రాణ్ కలిసి నటించిన చిత్రాల్లో 'జంజీర్', 'డాన్' గొప్ప చిత్రాలుగా పేరు తెచ్చుకున్నాయి.