: విజయవాడ-ఢిల్లీ ఏసీ ఎక్స్ ప్రెస్ కేటాయించడం శుభపరిణామం: కేశినాని నాని


రైల్వే బడ్జెట్ లో విజయవాడ - ఢిల్లీ ఏసీ ఎక్స్ ప్రెస్ కేటాయించడం శుభపరిణామమని టీడీపీ ఎంపీ కేశినాని నాని అన్నారు. దీంతో విజయవాడ ప్రజల 30 ఏళ్ల కల నెరవేరిందన్నారు. టిక్కెట్ ధరలు పెరిగినా సౌకర్యాలు కావాలనే ప్రజలు కోరుకుంటారని ఆయన పేర్కొన్నారు. రైల్వే స్టేషన్ల ఆధునికీకరణపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News