: ఎన్జీవోల వివరాలు ఇచ్చేందుకు సీబీఐకు సుప్రీం సమయం


దేశంలోని గుర్తింపు పొందిన ఎన్జీవోల (స్వచ్చంద సంస్థల) పూర్తి వివరాలు ఇచ్చేందుకు సీబీఐకు సుప్రీంకోర్టు మూడు నెలల సమయం ఇచ్చింది. ఎన్జీవోలకు సంబంధించిన సమాచారాన్ని అన్ని రాష్ట్రాలు ఇవ్వలేదని, ఇందుకు కొంత సమయం పడుతుందని సీబీఐ చెప్పిన మేరకు సింగిల్ బెంచ్ జడ్జి జస్టిస్ హెచ్ఎల్ దత్తు అంగీకరించారు. మరోవైపు సీబీఐ ఇప్పటివరకు సేకరించిన సమాచారంలో, చాలా ఎన్జీవోలు ఐటీ రిటర్న్స్ నమోదు చేయనివే ఉన్నాయి. ఇక గుజరాత్, తమిళనాడు ఇంతవరకు తమ రాష్ట్రాల్లోని ఎన్జీవోల వివరాలను ఇవ్వలేదని... ఆంధ్రప్రదేశ్, బీహార్, హర్యానా, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిషా, మహారాష్ట్రలు ఇప్పటివరకు పాక్షిక సమాచారాన్ని మాత్రమే ఇచ్చాయని తెలిపింది. 2011లో దాఖలైన పిల్ ఆధారంగా దేశంలోని ఎన్జీవోలన్నింటినీ న్యాయవ్యవస్థ కిందకు తీసుకురావాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో వారి ఆర్థిక నివేదికలు, రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్ల వివరాలు కోర్టుకు అందజేయాలని గతేడాదే సీబీఐని ఆదేశించింది.

  • Loading...

More Telugu News