: పార్లమెంటులో ఎంపీల వీధి పోరాటం
పార్లమెంటు స్థాయి దిగజారింది. దేశ చట్టసభ భవనం అట్టడుగు స్థాయికి దిగజారిపోయింది. పోలవరం ఆర్డినెన్స్ పై చర్చ ప్రవేశ పెట్టిన సందర్భంగా పలువురు ఎంపీలు నిరసనలు తెలుపుతూ స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. ఇంతలో ఏం జరిగిందో ఏమో కానీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు బయటకు దూసుకువచ్చారు. పార్లమెంటులో బీజేపీ ఎంపీలు తమ మహిళా ఎంపీతో అసభ్యంగా ప్రవర్తించి, తమపై దాడి చేశారని పేర్కొంటూ పార్లమెంటు బయట వారు ఆందోళన చేపట్టారు.