: దేశంలోనే మొట్టమొదటి బుల్లెట్ రైలు వచ్చేస్తోంది
దేశంలోనే తొలి బుల్లెట్ రైలును ముంబయి- అహ్మదాబాద్ మధ్య నడపనున్నట్లు రైల్వే మంత్రి సదానంద గౌడ లోక్ సభలో ప్రకటించారు. గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ఈ బుల్లెట్ రైలు దూసుకుపోతుంది. ఈసారి రైల్వే బడ్జెట్ లో 58 కొత్త రైళ్లను నడిపేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ముంబయి-అహ్మదాబాద్ మధ్య నడిచే బుల్లెట్ రైలు... ముంబయి, థానే, పాల్ గఢ్, వీరార్, సూరత్, వడోదర మీదుగా ప్రయాణిస్తూ అహ్మదాబాదుకు చేరుకుంటుంది. దేశంలో నాలుగు పెద్ద నగరాలైన ఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్ కతా నగరాల మధ్య కూడా బుల్లెట్ రైళ్లను నడపనున్నట్లు రైల్వే మంత్రి ప్రకటించారు.