: రైల్వే మంత్రి ఇంటి వద్ద కాంగ్రెస్ కార్యకర్తల రభస


లోక్ సభలో రైల్వే మంత్రి సదానంద గౌడ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలు పలువురు ఢిల్లీలోని ఆయన ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. ఈ ఆందోళన కార్యక్రమంలో కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోయారు. రైల్వే మంత్రి నేమ్ ప్లేట్ ను తొలగించి కాళ్ల కింద పడేసి తొక్కారు. అంతేగాకుండా, మంత్రి కారును ఇంట్లోకి వెళ్ళనీయకుండా అడ్డుకున్నారు. బడ్జెట్ లో ఎఫ్ డీఐలు, ప్రైవేటు భాగస్వామ్యం ప్రస్తావనతో రైల్వేలను ధనికులకు అనుకూలం చేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News