: పోలవరం ఆర్డినెన్స్ పై లోక్ సభలో రగడ... 3 గంటల వరకు వాయిదా


వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన లోక్ సభలో పోలవరం ఆర్డినెన్స్ పై తీవ్ర గందరగోళం నెలకొంది. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను టీఆర్ఎస్ వ్యతిరేకించింది. దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్ధీకరణ బిల్లుకు సవరణలు ప్రతిపాదించారు. ఆ వెంటనే, పోలవరం ముంపు మండలాలను తెలంగాణలోనే కలిపి ఉంచాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. అదే సమయంలో వారికి ఒడిశా, ఛత్తీస్ గఢ్ నేతలు మద్దతు పలికారు. ఈ క్రమంలో సభాపతి మధ్యాహ్నం మూడు గంటల వరకూ లోక్ సభను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.

  • Loading...

More Telugu News