: విజయవాడలో సమావేశమైన బీజేపీ కిసాన్ మోర్చా
విజయవాడలో భారతీయ జనతాపార్టీ కిసాన్ మోర్చా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జాతీయ నేతలు సోము వీర్రాజు, శ్యాం కిశోర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ... గత ప్రభుత్వాల నిర్వాకాల వల్లే వ్యవసాయరంగం సంక్షోభం దిశగా పయనిస్తోందని అన్నారు. ఈ సమావేశానికి 13 జిల్లాల నుంచి కిసాన్ మోర్చా నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.