: నెయ్ మార్ ని గాయపరిచిన ఆటగాడు శిక్ష నుంచి తప్పించుకున్నాడు


బ్రెజిల్ సూపర్ స్టార్ నెయ్ మార్ ని గాయపరిచిన కొలంబియా ఆటగాడు శిక్ష నుంచి తప్పించుకున్నాడు. మిడ్ ఫీల్డ్ నుంచి వేగంగా బంతిని కొలంబియా గొల్ పోస్టు వైపు తీసుకొస్తున్న నెయ్ మార్ ను కొలంబియా డిఫెండర్ జువాన్ కమిలో జ్యునిగా అడ్డుకున్నాడు. దీంతో నెయ్ మార్ అతడ్ని బలంగా 'ఢీ' కొన్నాడు. కిందపడ్డ నెయ్ మార్ బాధతో విలవిల్లాడిపోయాడు. అసహజమైన రీతిలో జ్యునిగాను ఢీ కొని, అదే రీతిలో నేలను బలంగా తాకడంతో నెయ్ మార్ తీవ్రంగా గాయపడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. నెయ్ మార్ గాయం తీవ్రత కారణంగా వైద్యులు 24 వారాల విశ్రాంతి సూచించారు. ఈ ఘటనపై విచారణ చేసిన పిఫా డిసిప్లినరీ కమిటీ జ్యునిగాపై ఏ చర్య తీసుకోలేదు. ఫుట్ బాల్ లో సాధారణ ఘట్టంగానే తీసుకుంది. దీనిపై బ్రెజిల్ కెప్టెన్ సిల్వా మండిపడ్డాడు. జ్యునిగా నెయ్ మార్ ను గాయపరిచేందుకే అలా మోకాలితో అడ్డుకున్నాడని ఆరోపించాడు. కాగా, ఇదే మ్యాచ్ లో సిల్లా యెల్లో కార్డు బారిన పడిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News