: అఫ్జల్ కుటుంబానికి ముందస్తు సమాచారం ఇవ్వలేదట!
అఫ్జల్ గురు ఉరిశిక్ష అమలులో నిబంధనలు పాటించలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. అఫ్జల్ ని ఉరితీస్తున్న విషయాన్ని ఆయన కుటుంబానికి తెలియజేయలేదని ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంలో తమకు ఏమాత్రం సమాచారం లేదని కాశ్మీర్లోని అఫ్జల్ కుటుంబ సభ్యులు వాపోయారు. అయితే, ఇలా ముందస్తు సమాచారం కచ్చితంగా అందజేయాలన్న నిబంధనలు ఏమీ లేవని మరోపక్క న్యాయకోవిదులు అంటున్నారు.
ఇదిలా ఉంచితే, అఫ్జల్ ఉరిశిక్ష అమలుకు సంబంధించి, కొన్ని క్షణాల క్రితం కేంద్ర హొమ్ శాఖ కార్యదర్శి ఆర్.కె. సింగ్ మీడియాతో మాట్లాడారు. జనవరి 26 న రాష్ట్రపతి అఫ్జల్ క్షమాభిక్ష తిరస్కరించారనీ, దాంతో నిబంధనల ప్రకారం ఉరి ప్రక్రియ మొదలైందనీ చెప్పారు. ఈ ఉదయం 8 గంటలకు తీహార్ జైలులో మరణశిక్ష అమలైందని ఆయన తెలిపారు.