: సదానంద గౌడ ప్రసంగం వివరాలు....
కేంద్ర రైల్వే మంత్రి సదానందగౌడ లోక్ సభలో రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ప్రసంగం ముఖ్యాంశాలు ఇవే... * హై స్పీడ్ నెట్ వర్క్ పై దృష్టి సరిస్తాం. * గత కొన్నేళ్లుగా రవాణా రంగంలో రైల్వేల ఆదాయం తగ్గుతూ వస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థగా రైల్వేలను అభివృద్ధి చేస్తాం. * ప్రస్తుతం రైల్వేకు వస్తున్న ఆదాయంలో ప్రతి రూపాయికీ 94 పైసలు ఖర్చులకు పోతోంది. * ఇప్పటిదాకా ప్రాజెక్టులు శాంక్షన్ చేయడమే తప్ప పూర్తి చేయడంపై దృష్టి సారించలేదు. ఇంకా 359 ప్రాజెక్టులు పూర్తి చేయాల్సి ఉంది. * పెండింగ్ ప్రాజెక్టుల కోసం రూ. 1.82 లక్షల కోట్ల నిధులు అవసరం ఉంది. * రైల్వేలు సామాజిక బాధ్యతను మరువలేదు. * పదేళ్లలో రూ. 3700 కోట్లతో 41,000 కిలోమీటర్ల రైల్వే లైన్లు వేశాం. * రైల్వేలో విదేశీ పెట్టుబడుల అవసరం చాలా ఉంది.