: భారత ఆర్థిక వ్యవస్థకు రైల్వే ఆత్మ లాంటిది: సదానందగౌడ
భారత ఆర్థిక వ్యవస్థకు రైల్వే ఆత్మ లాంటిదని రైల్వే బడ్జెట్ ప్రసంగంలో మంత్రి సదానందగౌడ పేర్కొన్నారు. బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో ఆయన మాట్లాడుతూ, కొత్త రైళ్లు, లైన్ల కోసం ఎంపీల నుంచి ఎన్నో విజ్ఞప్తులు తమకు వచ్చాయని తెలిపారు. రైల్వే ప్రతి రోజు 2.30 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తోందని తెలిపారు. త్వరలో హై స్పీడ్ నెట్ వర్క్ ను నెలకొల్పుతామన్నారు. సరకు రవాణాలో ప్రపంచంలో అగ్రగామి కావడమే భారత రైల్వే లక్ష్యమని పేర్కొన్నారు.