: భారత్ నుంచి నిష్క్రమిస్తున్న ఫ్రెంచ్ రిటైల్ దిగ్గజం
ఫ్రెంచ్ రిటైలర్ దిగ్గజం 'కార్ఫోర్' భారత్ నుంచి నిష్క్రమిస్తోంది. ఈ మేరకు 2010 నుంచి దేశంలో నడుపుతున్న ఐదు స్టోర్లను త్వరలో మూసివేసేందుకు సిద్ధమైంది. విదేశీ సంస్థలు భారత్ లో మల్టీ బ్రాండ్ రిటైల్ స్టోర్స్ ను ఆపరేట్ చేయడాన్ని బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్న సంస్ధ, ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి తమ స్టోర్స్ మూసివేయనున్నట్లు తన వెబ్ సైట్ లో ఓ ప్రకటనలో తెలిపింది.