: గందరగోళం వద్దు... సహకరించండి: జవదేకర్
బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కాసేపటి క్రితం ముగిసింది. ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో బడ్జెట్ సందర్భంగా ఏ విధంగా వ్యవహరించాలన్న అంశంపై చర్చించారు. అనంతరం కేంద్రమంత్రి జవదేకర్ మాట్లాడుతూ, సభలో అన్ని విషయాలపై కూలంకుషంగా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. విపక్షాలు అనవసరంగా గందరగోళానికి పాల్పడకుండా, సభ సజావుగా సాగేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.