: విమానాశ్రయంలో టీనేజర్ హంగామా


తాను ఎయిర్ పోర్టులో పాస్ పోర్టు మర్చిపోయి వచ్చానంటూ విమానంలో ఓ టీనేజర్ హంగామా సృష్టించాడు. చెన్నైలోని మీనంబాక్కం విమానాశ్రయం నుంచి దుబాయ్ కు ఓ విమానం బయల్దేరింది. తీరా టేకాఫ్ అయ్యాక ఈ కుర్రాడు పైకిలేచి... పాస్ పోర్టు విషయం వెల్లడించాడు. తాను దుబాయ్ మీదుగా అమెరికా వెళ్ళాల్సి ఉందన్నాడు. దీంతో, మళ్ళీ విమానాన్ని మీనంబాక్కం ఎయిర్ పోర్టులో దించారు. తీరా, ల్యాండయ్యాక చూస్తే ఆ పాస్ పోర్టు సదరు టీనేజర్ వద్ద ఉన్న మరో బ్యాగులో ఉంది. దీంతో, సిబ్బందికి చిర్రెత్తుకొచ్చింది. జరిగిన ఆలస్యానికి అతడినే బాధ్యుడిని చేస్తూ తోటి ప్రయాణికులకు క్షమాపణ చెప్పించారు. ఆ బాలుడితో పాటు విమానంలో ఓ బంధువు కూడా ఉన్నారు.

  • Loading...

More Telugu News