: నేడు వైయస్ జయంతి... ఇడుపులపాయకు జగన్, షర్మిల
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి 65వ జయంతి నేడు. ఈ సందర్భంగా వైయస్ సమాధి వద్ద నివాళులు అర్పించడానికి వైయస్ తనయుడు, వైకాపా అధినేత జగన్ ఈ ఉదయం ఇడుపులపాయకు చేరుకున్నారు. జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిల నిన్న రాత్రే ఇక్కడకు చేరుకున్నారు. ఇడుపులపాయలో వైయస్ సమాధి వద్ద నిన్న రాత్రే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. బెంగళూరుకు చెందిన వ్యక్తులు వివిధ రకాల పూలతో సమాధిని అలంకరించారు. ఈ నేపథ్యంలో, వైకాపా కేంద్ర, జిల్లా కార్యాలయాల్లో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.