: భూకంపాల్ని చీమలు ముందే పసిగడ్తాయి


భూకంపం ఎప్పుడు రాబోతోందనే విషయాన్ని చీమలు ఒకరోజు ముందే పసిగట్టేస్తాయట. శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో ఈ విషయాన్ని కొత్తగా కనుక్కొన్నారు. భూకంపం వచ్చే సమయానికి ఒక రోజు ముందునుంచి వాటి ప్రవర్తన విపరీతంగా మారిపోతుందని.. భూకంపం తర్వాత ఒకరోజు గడిచాక గానీ.. అవి తిరిగి మామూలు పరిస్థితి రాలేవని ఈ పరిశోధనలో తేల్చారు.

జర్మనీలో డ్యుస్‌బెర్గ్‌ ఎస్సెన్‌ యూనివర్సిటీకి చెందిన గాబ్రియేల్‌ బెర్బెరిచ్‌ ఈ విషయాన్ని కనుగొన్నారు. బెర్బెరిచ్‌ ఆమె సహచరులు కలిసి జర్మనీలో 15 వేల చీమల పుట్టలను ఈ సందర్భంగా పరిశీలించారు. ప్రత్యేకమైన కెమెరా మౌంటెడ్‌ సాఫ్ట్‌వేర్‌తో చీమల దినచర్యలో మార్పులను వారు గమనించారు. మూడేళ్లపాటూ నిరంతరాయంగా ఈ కెమెరా ద్వారా బెర్బెరిచ్‌ బృందం పరిశీలన సాగింది. 2009 నుంచి 2012 వరకు పరిశీలించి భూకంపం తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 2 కంటె ఎక్కువగా ఉండే సందర్భాల్లో మాత్రమే.. చీమల విపరీత ప్రవర్తన నమోదు అవుతున్నట్లుగా వారు గుర్తించారు.

సాధారణంగా చీమలు పగటిపూట ఆహారం వెతికి తీసుకువచ్చి.. రాత్రివేళ పుట్టలోపలకు వెళ్లి నిద్రపోతాయి. అయితే భూకంపం వచ్చే రోజుల్లో ఒక రోజుముందునుంచి ఇవి పుట్టలోకి వెళ్లకుండా ఉండడాన్ని ఈ బృందం గుర్తించింది. రాత్రిళ్లు కూడా పుట్ట బయటే నిద్రపోతుండడాన్ని వీరు గుర్తించారు. అలాగే. భూకంపం వచ్చిన తర్వాత ఒక రోజుకు గానీ.. అవి తిరిగి పుట్టలోకి వెళ్లలేదు.

  • Loading...

More Telugu News