: అంతరిక్షపరిశోధనలో రష్యా మరో అడుగు
అంతరిక్షపరిశోధనలో తన ఆధిపత్యం నిలబెట్టుకునేందుకు రష్యా మరింత ప్రయత్నం చేస్తోంది. మానవులను అంతరిక్షంలోకి క్రమం తప్పకుండా పంపడం లక్ష్యంగా.. అముర్ ప్రాంతంలో ఒక కొత్త ఉపగ్రహ ప్రయోగ కేంద్రం (కాస్మోడ్రోం) ను రష్యా నిర్మించింది. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దీని నిర్మాణాన్ని ప్రారంభించారు. సోవియట్ హీరో యూరి గగారిన్ అంతరిక్షంలోకి వెళ్లి 52 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ కాస్మోడ్రోం నుంచి 2015 నాటికి మొదటి ఉపగ్రహం పంపేలా నిర్మాణం పూర్తవుతుందని పుతిన్ ప్రకటించాడు. 2020 నాటికి పూర్తి కార్యకలాపాలు ప్రారంభిస్తుందిట. 2018లో తొలి మానవ సహిత ఉపగ్రహాల్ని ప్రయోగిస్తారట.