: హైదరాబాద్ లో మరో రెండు ఎయిర్ పోర్టులు


హైదరాబాద్ లో మరో రెండు ఎయిర్ పోర్టులను నిర్మించనున్నట్లు తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రకటించారు. హైదరాబాద్ నగరంలో పలు సమస్యలు తిష్ట వేశాయని, వీటిని పూర్తిగా పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఆయన సోమవారం తెలిపారు. ఇందులో భాగంగానే నగరంలో మరో రెండు ఎయిర్ పోర్టులను ఏర్పాటు చేయాలని తీర్మానించామన్నారు. అదేవిధంగా పారిశుద్ధ్యం పరిస్థితిని చక్కదిద్దేందుకు నగరంలో కొత్తగా పది డంపింగ్ యార్డులను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను క్రమేణా పెంచుతామని చెప్పిన ఆయన రూ. వెయ్యి కోట్ల మేర ఖర్చుతో మైనర్ ఇరిగేషన్ ను అభివృద్ధి చేస్తామన్నారు.

  • Loading...

More Telugu News