: ధరల పెంపుపై ప్రతిపక్షాల నిరసన... రాజ్యసభ నుంచి వాకౌట్


ధరల పెంపుపై రాజ్యసభలో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని దుయ్యబట్టాయి. అధిక ధరలు, రైల్వే ఛార్జీలపై కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ఇచ్చిన వివరణ పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రతిపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. అంతకుముందు సభలో మాట్లాడిన జైట్లీ, ధరల పెరుగుదల పాపం యూపీఏదేనని ధ్వజమెత్తారు. ఆ పాపం తమపై (బీజేపీ) నెట్టాలని కాంగ్రెస్ చూస్తోందని విమర్శించారు. రైల్వేలు రూ.30వేల కోట్ల నష్టాల్లో ఉన్నాయని, చార్జీలు పెంచకుంటే రెండు నెలల్లో రైల్వేలను మూసివేయాల్సిందేనని తెలిపారు. అసలు రైలు చార్జీలు పెంచాలని యూపీఏ ప్రభుత్వమే నిర్ణయించిందన్న జైట్లీ, రైల్వేల దుస్థితికి తృణమూల్ కూడా కారణమేనని మండిపడ్డారు. యూపీఏ పాలనలో దేశ ఆర్థిక స్థితి అధ్వానమైందని వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన ఐదు వారాల్లోనే పరిస్థితిని తాము మార్చలేమని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News