: 'రాష్ట్ర పునర్విభజన చట్టం సవరణ బిల్లు'కు వాయిదా కోరిన రాజ్ నాథ్ సింగ్


ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం సవరణ బిల్లును వాయిదా వేయాలని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ రోజు లోక్ సభ స్పీకర్ ను కోరారు. సమయం లేనందునే బిల్లు ప్రవేశాన్ని వాయిదా వేయాలని రాజ్ నాథ్ విన్నవించారు. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో కలుపుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనికి రాష్ట్రపతి కూడా ఆమోదం తెలిపారు.
ఇదిలావుంటే ఈ ఆర్డినెన్స్ ను వ్యతిరేకిస్తున్న టీఆర్ఎస్ సభలో నేడు నోటీస్ ఇచ్చింది. ఒక రాష్ట్ర సరిహద్దు మార్చాలంటే ఆయా ప్రభుత్వాల శాసనసభల అభిప్రాయాలు తెలుసుకోవాలని, దానికోసం బిల్లును వారికి పంపాలని నోటీసులో తెలిపింది. దాంతో, ఈ రోజు ప్రవేశపెట్టాల్సిన బిల్లును రాజ్ నాథ్ వేయిదా వేశారని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ అనంతరం మీడియాకు తెలిపారు.

  • Loading...

More Telugu News