: మూలకణాలతో గుండె జబ్బులకు చెక్‌


గుండెజబ్బుతో బాధపడుతున్న వారికి మూలకణాలతో సమర్థమైన చికిత్స అందించడం సాధ్యం అవుతుందని శాస్త్రవేత్తలు నిరూపిస్తున్నారు. కేవలం సమర్థమైనదే కాకుండా సత్వర చికిత్స కూడా వీలవుతుందని తేలుస్తున్నారు. అమెరికాలోని మాయోక్లినిక్‌ రీజెనరేటివ్‌ మెడిసిన్‌ సెంటర్‌ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు.

గుండెజబ్బుతో బాధపడుతున్న రోగి పిరుదుల నుంచి మూలకణాలను సేకరించి.. వాటిని గుండెలోకి ఇంజెక్షన్‌ ద్వారా ఎక్కించారు. దీంతో గుండె కండరాలు గట్టిపడి.. పని తీరు మెరుగైంది. కేవలం ఆరునెలల్లోనే ఇది సాధ్యం కావడం విశేషం. ఈ పద్ధతిలో చికిత్స పొందిన వారంతా ఆరోగ్యంగానే ఉన్నారని కూడా వైద్యులు ప్రకటించారు.

  • Loading...

More Telugu News