: కొలంబియాకు ఘనస్వాగతం
2014 ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ టోర్నమెంట్ లో క్వార్టర్ ఫైనల్ నుంచి నిష్క్రమించిన కొలంబియా జట్టుకు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన బ్రెజిల్ చేతిలో ఓటమిపాలవ్వడంతో కొలంబియా నిష్క్రమించింది. దీంతో జట్టు స్వదేశం చేరుకుంది. జట్టు సభ్యుల వీరోచిత పోరాటాన్ని మీడియా కీర్తించగా, ఆటగాళ్లను చూసేందుకు విమానాశ్రయం నుంచి వీధులన్నీ అభిమానులతో నిండిపోయాయి. స్వదేశం చేరుకున్న ఆటగాళ్లకు 1,25,000 మంది ప్రజలు వీధుల్లో స్వాగతం పలికారు. దేశ ప్రజల అభిమానమే తమను ఈ స్థితికి చేర్చిందని జట్టు కోచ్ జోస్ పెకర్మాన్ హర్షం వ్యక్తం చేశారు.