: అమితాబ్, నసీరుద్దీన్ షాలతో విద్యబాలన్
గతంలో అమితాబ్ బచ్చన్ తో కలిసి 'పా' సినిమాలో నటించిన విద్యాబాలన్ మళ్ళీ ఇప్పుడు ఆయనతో కలిసి మరో చిత్రంలో నటిస్తోంది. సుజయ్ ఘోష్ దర్శకత్వం వహిస్తున్న ఈ హిందీ చిత్రం పేరు 'బద్లా'. ఇందులో మరో విశేషం ఏమిటంటే, ప్రముఖ నటుడు నసీరుద్దీన్ షా కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. నసీర్, విద్య కలిసి ఇటీవల 'డర్టీ పిక్చర్' సినిమాలో నటించారు. అది కూడా సుజయ్ ఘోష్ దర్శకత్వంలోనే రూపొందింది. ఇన్ని ప్రత్యేకతలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎటువంటి సంచలనాలకు తెర తీస్తుందో చూడాలి!