: ప్రధాని సొంత రాష్ట్రంలో గృహ హింస కేసులు
ప్రధాని సొంత రాష్ట్రంలో గృహ హింస కేసులు పెరిగాయి. అదే సమయంలో దోష నిర్ధారణ శాతం తగ్గిందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్ఆర్ బీ) గణాంకాలు తెలిపాయి. 2013లో గుజరాత్ లో 7812 గృహ హింస కేసులు నమోదయ్యాయి. అయితే, దోష నిర్ధారణ సగటు దేశంలో 16 శాతం ఉండగా, గుజరాత్ లో కేవలం 2.30 శాతంగా ఉండడం విశేషం.
ఈ లెక్కన దేశంలో గృహ హింస కేసుల్లో గుజరాత్ ఏడో స్థానంలో నిలిచింది. దోష నిర్ధారణలో 25వ స్థానంలో నిలించింది. ఆ రాష్ట్రంలో 498ఏ చట్టం కింద నమోదైన కేసులు 17.3 శాతం పెరిగాయి. మహిళలకు సంబంధించి 12,283 కేసులు నమోదు కాగా, 64 శాతం కేసులు గృహ హింసకు సంబంధించినవి కావడం విశేషం.