: తుస్సుమన్న 'డెవిల్స్'


సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ పేలవ బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చారు.ఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరుగుతున్న ఈ పోరులో సొంత గడ్డ అనుకూలతను ఉపయోగించుకోవడంలో డేర్ డెవిల్స్ బ్యాట్స్ మెన్ మూకుమ్మడిగా విఫలమయ్యారు. ఈ మ్యాచ్ లో ఏ ఒక్కరూ భారీ స్కోరు సాధించలేదు. వార్నర్ డకౌట్ కాగా, వీరూ (12), జయవర్ధనే (12) స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరారు. జాదవ్ చేసిన 30 పరుగులే టాప్ స్కోర్. దీంతో, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 114 పరుగులే చేసింది. సన్ రైజర్స్ బౌలర్లలో స్టెయిన్, ఇషాంత్ శర్మ, పెరీరా తలో రెండు వికెట్లు తీసి ఢిల్లీని కష్టాల్లోకి నెట్టారు.

  • Loading...

More Telugu News