: జర్మన్ సాకర్ జట్టుకు చేతబడి చేస్తానంటున్న బ్రెజిల్ తాంత్రికుడు


ఎల్లుండి బ్రెజిల్, జర్మనీ జట్లు ఫిఫా వరల్డ్ కప్ సెమీస్ లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. అయితే, తమ జట్టుపై జర్మనీ నెగ్గకుండా ఉండేందుకు ఓ తాంత్రికుడు చేతబడి చేస్తానంటూ ముందుకొచ్చాడు. జర్మనీ జట్టులో స్టార్ ఆటగాడి రూపంలో ఓ బొమ్మను తయారుచేసి, మంత్రతంత్రాలతో దాని కాళ్ళు కట్టిపడేస్తానని, తద్వారా ఆ స్టార్ ఆటగాడు మ్యాచ్ లో సరిగా పరిగెత్తలేడని ఈ క్షుద్రోపాసకుడు పేర్కొన్నాడు. ఇతడి పేరు హీలియో సిల్ మాన్. బ్రెజిల్ లోని మదురీరా ప్రాంతంలో నివసించే సిల్ మాన్ క్షుద్రపూజలు చేయడంలో దిట్ట.
ఫుట్ బాల్ గ్రౌండ్ ఆకారంలో ఓ పెట్టె, దాంట్లో ప్రత్యర్థి జట్టు రంగులతో ఉన్న కొవ్వొత్తులు, కీలక ఆటగాడి బొమ్మ... ఈ ఏర్పాట్లతో బ్రెజిల్ సాకర్ జట్టు ఆడే ప్రతి మ్యాచ్ కు ముందూ సిల్ మాన్ క్షుద్రపూజలు నిర్వహిస్తాడు. ఈసారి కూడా చేతబడి చేసి తీరతానని స్పష్టం చేశాడు. కాగా, నేమార్ గాయపడకుండా అడ్డుకోవడంలో తన మంత్ర శక్తులు పనిచేయలేదని తెలిపాడీ కలియుగ మాంత్రికుడు.

  • Loading...

More Telugu News