: చెల్లి బర్త్ డే కానుకగా 'బాహుబలి' వీడియో రిలీజ్ చేసిన రాజమౌళి
బాహుబలి సినిమా నిర్మాణ దశలోనూ ప్రచారపరంగా ఫుల్ మార్కులు కొట్టేస్తోంది. ఆ క్రెడిటంతా దర్శకుడు రాజమౌళిదే. సినిమా నిర్మాణ విశేషాలను ఎప్పటికప్పుడు వీడియో రూపంలో విడుదల చేస్తూ అటు సినీ వర్గాల్లో, ఇటు ప్రేక్షకుల్లో క్రేజ్ తగ్గకుండా చూసుకుంటున్నాడు. అయితే, ఆ వీడియోలను చిత్ర యూనిట్ లో ఎవరో ఒకరి జన్మదినం నాడు విడుదల చేయడం ఆనవాయితీగా వస్తోంది.
తాజాగా, ఈ సినిమాకు ఆన్ లైన్ ప్రొడ్యూసర్ గా పనిచేస్తున్న సోదరి ఎంఎం శ్రీలేఖ బర్త్ డే పురస్కరించుకుని బాహుబలి మేకింగ్ వీడియోను విడుదల చేశాడు జక్కన్న. షూటింగ్ లో అందరినీ పలకరిస్తూ హుషారుగా ఉన్న ప్రభాస్, రాజమౌళి, ఇంకా ఆర్ట్ విభాగం సిబ్బంది ఈ వీడియోలో కనిపిస్తారు.