: నేడు భారత్ రానున్న బ్రిటన్ విదేశాంగ మంత్రి
రెండ్రోజుల పర్యటన కోసం బ్రిటన్ విదేశాంగ మంత్రి విలియం హేగ్ నేడు భారత్ వస్తున్నారు. ఆయన వెంట బ్రిటన్ సీనియర్ మంత్రులు కూడా ఈ పర్యటనలో పాల్గొంటారు. కాగా, ఈ పర్యటనలో భాగంగా రెండు దేశాల మధ్య పెట్టుబడులు, రక్షణ ఒప్పందాలు, భద్రత అంశాలు చర్చకు రానున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్న బ్రిటీష్ బృందం విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ నూ కలసి చర్చించనున్నారు.
గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో మోడీపై బ్రిటన్ దశాబ్దకాలం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. 2012లో మోడీ గుజరాత్ సీఎంగా తిరిగి ఎన్నికయ్యాక బ్రిటన్ ఆ నిషేధాన్ని ఎత్తివేసింది.