: ఆరో ఐటెంగా పోలవరం... ఆర్డినెన్సుపై నేడు రాజ్ నాథ్ వివరణ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలవరం ప్రాజెక్టు అంశం ఈ రోజు పార్లమెంటు ముందుకు రానుంది. ఆరో ఐటెంగా పోలవరంను చేర్చారు. ముంపు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపుతూ ఆర్డినెన్సు జారీ చేయడానికి గల కారణాలను కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ రోజు సభ ముందు ఉంచుతారు. అంతేకాకుండా, పోలవరం అంశంపై బిల్లును కూడా ఈ సమావేశాల్లోనే ప్రవేశపెడతారు.