: 'జీమెయిల్' వాడకంపై మధ్యప్రదేశ్ సర్కారు నిషేధం
మధ్యప్రదేశ్ సర్కారు ఈ-గవర్నెన్స్ లో భాగంగా ప్రత్యేక చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలో అధికారిక సమాచార మార్పిడి కోసం జీమెయిల్, హాట్ మెయిల్, రెడిఫ్ మెయిల్ వంటి సర్వీసుల వాడకంపై నిషేధం విధించింది. ఇకపై, ప్రత్యేక మెయిల్ సర్వీసును ఉద్యోగులకు అందుబాటులోకి తేనుంది. కీలకమైన ప్రభుత్వ సమాచారం పరుల పాలవకుండా ఉండేందుకే ఈ నిర్ణయం అని తెలుస్తోంది. ఇకపై, అత్యంత కీలక సమాచారం పంపేటప్పుడు ఆ మెయిల్ భద్రత కోసం డిజిటల్ సర్టిఫికెట్ విధానాన్ని అనువర్తింప చేయాలని కూడా ఎంపీ సర్కారు నిర్ణయించింది.