: 48 గంటల్లో ఇండియాకు మరో 286 మంది: విదేశాంగ శాఖ
ఇరాక్ నుంచి ఇప్పటిదాకా 300 మందికి పైగా భారతీయులను వెనక్కి తీసుకొచ్చామని భారత విదేశాంగ శాఖ తెలిపింది. రానున్న 48 గంటల్లో మరో 286 మందిని తీసుకొస్తామని వెల్లడించింది. ఇరాక్ లో చిక్కుకున్న మన దేశీయులను తీసుకొచ్చేందుకు ఆ దేశంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో మొబైల్ టీంలను ఏర్పాటు చేశామని తెలిపింది. భారతీయుల తిరుగు ప్రయాణానికి ఈ టీంలు సహకరిస్తాయని విదేశాంగ శాఖ అధికారులు చెప్పారు.