: తొలి టెస్టుకు స్పోర్టివ్ పిచ్... టీమిండియాకు హ్యాపీ!


ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా టీమిండియా ఐదు టెస్టులు ఆడనుంది. ఈ క్రమంలో తొలి టెస్టు బుధవారం ట్రెంట్ బ్రిడ్జ్ లో ఆరంభమవుతుంది. ఈ మ్యాచ్ కోసం స్పోర్టివ్ పిచ్ సిద్ధం చేస్తున్నామని గ్రౌండ్ క్యూరేటర్ స్టీవ్ బిర్క్స్ తెలిపారు. పిచ్ పై గడ్డి ఎండిపోయిందని, అటు బ్యాట్స్ మెన్ కు ఇటు బౌలర్లకు సమంగా అనుకూలిస్తుందని బిర్క్స్ చెప్పుకొచ్చారు. జట్లు స్వల్పస్కోర్లకే అవుటవ్వాలని తాము భావించడంలేదని అన్నారు.
కాగా, బిర్క్స్ చెప్పే విషయాలు పరిగణనలోకి తీసుకుంటే టీమిండియాకు ఇది శుభపరిణామమే అని చెప్పవచ్చు. ఇంతకుముందు భారత జట్టు ఇంగ్లండ్ లో పర్యటించినప్పుడు ఆరంభంలోనే ఫాస్ట్ పిచ్ లు ఎదురయ్యేవి. దీంతో, ఆ తడబాటు కాస్తా సిరీస్ మొత్తమ్మీద ప్రభావం చూపేది.

  • Loading...

More Telugu News