: అంబటి రాయుడు డకౌట్
ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న భారత్ ఏ జట్టు నేడు ఆసీస్ ఏ జట్టుతో తొలి టెస్టు ఆడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న 'భారత్ ఏ' తొలి రోజు ఆట చివరికి మొదటి ఇన్నింగ్స్ లో 6 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. కాగా, తెలుగుతేజం అంబటి రాయుడు తీవ్రంగా నిరాశపరిచాడు. పరుగులేమీ చేయకుండానే మార్ష్ బౌలింగ్ లో బౌల్డయ్యాడు.
కాగా, 43 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన జట్టును జీవన్ జ్యోత్ సింగ్ (56), కెప్టెన్ మనోజ్ తివారీ (83), నమన్ ఓజా (82 బ్యాటింగ్) ఆదుకున్నారు. ఓపెనర్ గా బరిలో దిగిన రాబిన్ ఊతప్ప 23 పరుగులు చేశాడు. ఆసీస్ బౌలర్లలో బెన్ కట్టింగ్, మిచెల్ మార్ష్, బోయ్స్ తలో రెండు వికెట్లు తీశారు.