: భారత జాలర్లను అరెస్టు చేసిన శ్రీలంక నేవీ
శ్రీలంక నావికాదళం సముద్ర జలాల్లో చేపల వేట సాగిస్తున్న 20 మంది భారత జాలర్లను అరెస్టు చేసింది. తమిళనాడుకు చెందిన ఈ జాలర్లు కచ్చత్తీవు ప్రాంతంలో వేటాడుతుండగా లంక నేవీ అదుపులోకి తీసుకుంది. వీరికి చెందిన నాలుగు బోట్లను కూడా స్వాధీనపర్చుకుంది. వీరందరినీ తలైమన్నార్ తరలించారు.