: వైఎస్సార్సీపీ ఎంపీలపై యనమల ధ్వజం
హైదరాబాద్ లోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఏపీ ఎంపీల సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ, అన్ని పార్టీల ఎంపీలు వచ్చినా, వైఎస్సార్సీపీ ఎంపీలు మాత్రం హాజరుకాలేదని చెప్పారు. వారికి రాష్ట్రాభివృద్ధిపై చిత్తశుద్ధి లేనట్టుందని విమర్శించారు. పేదలకు సంక్షేమ ఫలాలు అందడం వారికిష్టం లేనట్టుందని దుయ్యబట్టారు. వారికి రాజకీయాలే పరమావధి అని ఆరోపించారు.
ఇక, సమావేశం విశేషాలు చెబుతూ, కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంపై చర్చించామని తెలిపారు. కేంద్రంతో మాట్లాడాల్సిన 35 అంశాలను గుర్తించామని చెప్పారు. నిధుల కోసం ఎంపీలందరూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించాలని యనమల సూచించారు. పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న అంశాల అమలుకు కృషి చేయాలని కోరారు.