: భారీ వర్షంతో కళకళలాడుతున్న తిరుపతి, తిరుమల
నిన్న రాత్రి కురిసిన భారీ వర్షంతో తిరుపతి, తిరుమల కళకళలాడుతున్నాయి. గత ఆరు నెలలుగా వర్షాలు లేక ఎండిపోయిన తిరుపతిలోని కపిలతీర్థం జలపాతం... రాత్రి కురిసిన వర్షంతో జలకళను సంతరించుకుంది. తిరుమల కొండపై నుంచి వస్తున్న నీటితో ఆహ్లాదకరంగా మారింది. దీంతో, తిరుపతి వాసులతో పాటు, తిరుమలకు వచ్చిన భక్తులు భారీ సంఖ్యలో కపిలతీర్థంలో పుణ్య స్నానాలు ఆచరించి కపిలేశ్వరుడిని దర్శించుకుంటున్నారు.