: నా కల ముగిసింది... బ్రెజిల్ కల సజీవంగానే ఉంది: నేమార్


కొలంబియాతో క్వార్టర్ ఫైనల్లో తీవ్రంగా గాయపడి వరల్డ్ కప్ కు దూరమైన బ్రెజిల్ సూపర్ ఫార్వర్డ్ నేమార్ ఆర్ద్రత నిండిన వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్ కప్ ఫైనల్ ఆడాలన్న తన ఆశలను దొంగిలించారని వ్యాఖ్యానించాడు. కానీ, తన కల ముగిసినా, కప్ గెలవాలన్న బ్రెజిల్ కల సజీవంగానే ఉందని పేర్కొన్నాడు. 'టైటిల్' క్రమంలో ఇంకా రెండు మ్యాచ్ లు మిగిలే ఉన్నాయని, కప్ గెలిచేందుకు సహచరులు సర్వశక్తులూ ఒడ్డుతారని నేమార్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ఫిఫా వరల్డ్ కప్ సెమీస్ లో బ్రెజిల్, బలమైన జర్మనీతో తలపడనుంది.

  • Loading...

More Telugu News