: వాన్ పిక్ కేసులో అందరూ జైలులో ఉంటే, ఓ వ్యక్తి మాత్రం బయటున్నారు: బాబు


కాంగ్రెస్ సర్కారుపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న ఆయన మాట్లాడుతూ, వాన్ పిక్ కేసులో అందరూ జైలులో ఉంటే ఓ వ్యక్తి మాత్రం బయట ఉన్నాడని అన్నారు. ఆ వ్యక్తి పేరు ధర్మాన అని, ఆయన చేసేవన్నీ అధర్మాలే అని విమర్శించారు. ఇక హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేయడంపై స్సందిస్తూ, హోం మంత్రి పేరే ఛార్జిషీటులో ఉంటే పోలీసులు ఏం పని చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర క్యాబినెట్ 420 మంత్రులతో నిండిపోయిందని బాబు వ్యాఖ్యానించారు. సీఎం కిరణ్ ఈ అవినీతి మంత్రులకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడని దుయ్యబట్టారు. పనిలోపనిగా బాబు.. పీసీసీ చీఫ్ బొత్సనూ టార్గెట్ చేశారు. వోక్స్ కుంభకోణంలో నిందితుడు షూస్టర్ జర్మనీ జైలులో ఉంటే.. ఆ కుంభకోణంలో ఇక్కడ అవినీతికి పాల్పడ్డ వ్యక్తి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నాడని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News