: ఇందిరాభవన్ లో కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి సదస్సు ప్రారంభం
హైదరాబాదులోని ఇందిరాభవన్ లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి సదస్సు ప్రారంభమయింది. ఈ సదస్సుకు హాజరైన వారిలో ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, చిరంజీవి, కేవీపీ రామచంద్రరావు, రుద్రరాజు పద్మరాజు తదితర నేతలు ఉన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం సాధించే దిశగా చర్చలు సాగుతున్నాయి. అంతేకాకుండా, కాంగ్రెస్ నేతలు ఇతర పార్టీల్లోకి వలస వెళ్లకుండా ఉండేందుకు తీసుకోవలసిన చర్యలపై చర్చిస్తున్నారు.