: మత ఆధారిత రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం: వెంకయ్యనాయుడు


ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామంటూ పలు పార్టీలు హామీలు గుప్పిస్తున్న నేపథ్యంలో, మత ఆధారిత రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమంటూ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కేంద్ర ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారు. ఈ రోజు హైదరాబాదులోని బీజేపీ కార్యాలయంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంత్యుత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఎన్నికల్లో ఘోర ఓటమిని మూటగట్టుకున్న కాంగ్రెస్ పరిస్థితి ఒడ్డున పడ్డ చేపలా తయారైందని ఎద్దేవా చేశారు. దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవని... కొన్ని చేదు గుళికలు మింగక తప్పదని చెప్పారు.

  • Loading...

More Telugu News