: రైతుల కోసం 'డీడీ కిసాన్' చానల్
బీజేపీ సర్కారు రైతుల అభ్యున్నతిపై దృష్టిపెట్టింది. రైతుల కోసం ప్రత్యేకంగా ఓ టీవీ చానల్ ప్రారంభించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. నిర్విరామంగా ప్రసారమయ్యే ఈ చానల్ ద్వారా రైతులకు విత్తనాలు, ఎరువుల సమాచారమే కాకుండా, వాతావరణ సమాచారం కూడా అందిస్తారు. ఈ చానల్ కు 'డీడీ కిసాన్' అని పేరు పెట్టనున్నట్టు తెలుస్తోంది. తాము అధికారంలోకి వస్తే కిసాన్ చానళ్ళు ఏర్పాటు చేస్తామని ఎన్నికల ప్రచార సమయంలో బీజేపీ హామీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ చానల్ ఏర్పాటు కోసం ప్రసారభారతి కసరత్తులు చేస్తోంది.