: తెలంగాణ నేతలతో చంద్రబాబు సమీక్ష సమావేశాలు
పార్టీకి చెందిన తెలంగాణ నేతలతో తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. ఇటీవల జరిగిన సహకార ఎన్నికల విశ్లేషణతో బాటు, తెలంగాణ ఉద్యమంలో పార్టీ నిర్వహించాల్సిన పాత్ర, స్థానిక సంస్థల ఎన్నికలు... తదితర అంశాలపై బాబు వీరితో సమీక్షిస్తారు. ఈ సమావేశాలు ఈ నెల 11 నుంచి నిర్వహిస్తారు. తెలంగాణ నేతలతో ఈ సమీక్షలు బాబు పాదయాత్రలోనే జరుగుతాయి.