: టూర్ కెళ్తే...కిడ్నాప్ అనుకున్నారు: జానీ


కడప జిల్లా జమ్మలమడుగులో అదృశ్యమైన కౌన్సిలర్ మహ్మద్ జానీని గోవా పోలీసులు కడప కోర్టులో ప్రవేశపెట్టారు. మున్సిపల్ ఛైర్మన్ పదవి దక్కకుండా అడ్డుకునేందుకు వైఎస్సార్సీపీ నేతలు అతనిని కిడ్నాప్ చేశారంటూ కలకలం రేగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను కోర్టులో ప్రవేశపెట్టారు. సమావేశం జరుగుతుందని తెలియక టూర్ కి వెళ్లానని, తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని న్యాయూమూర్తి ఎదుట ఆయన వాంగ్మూలమిచ్చారు. దీంతో కోర్టు అతనిని కుటుంబ సభ్యులు, బంధువులకు అప్పగించింది.

  • Loading...

More Telugu News